
బాసరకు పోటెత్తిన భక్తులు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విశ్వవాసు నామ సంవత్సరం ఏకాదశి శుభ ముహూర్తం ఉండడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. వేకువ జా మున శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, మహాకాళి అమ్మవా ర్లకు అభిషేకం, అర్చన, హారతి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు. ముందుగా భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలో బారులు తీరారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరిపించారు. అక్షరాభ్యాసం, ఇతర సేవల ద్వారా రూ. 8 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బాసరకు పోటెత్తిన భక్తులు