
విద్యుత్‌షాక్‌తో వృద్ధురాలు మృతి
నిర్మల్‌రూరల్: మండలంలోని ముజిగి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన పెద్దగొండ గంగవ్వ (72) తన ఇంటి బయట మెట్ల సమీపంలో ఉన్న ఇనుపరాడును పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. స్తంభం నుంచి ఇంటికి వచ్చే వైర్‌కు విద్యుత్ సరఫరా ఉండడంతో భారీ వర్షాలకు ఎర్తింగ్ ద్వారా బయట ఉన్న మెట్ల ఇనుప చువ్వలకు కూడా కరెంటు సరఫరా అయినట్లు ఎస్సై ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.