
కాల్వ ఆలయ హుండీ లెక్కింపు
దిలావర్‌పూర్: మండలంలోని అత్యంత ప్రాచీన ప్రాశస్త్యం గల కాల్వ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ హుండీని శుక్రవారం లెక్కించారు. ఇటీవల జరిగిన ఆలయ బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఈ హుండీని లెక్కించారు. హుండీ ద్వారా రూ.3,77,446 ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కల్యాణం సందర్భంగా తాళిబొట్ల రూపంలో మిశ్రమ బంగారం సైతం సమకూరినట్లు వెల్ల డించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంగూరి మహేందర్, దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్‌లు మనోహర్, మాధవరావు, పాలక మండలి సభ్యులు గట్టు కాశీనాథ్, రాసరి శ్రీకాంత్, గుమ్ముల నర్సయ్య, సూర నవీన్, పూదరి శివకుమార్, దేవేందర్, లక్ష్మణ్, విఠల్, మహేందర్, నర్సారెడ్డి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.