
సరస్వతి పుష్కర సేవలో జిల్లా ఉద్యోగులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఈ నెల 14 నుంచి కాళేశ్వరంలో ప్రారంభమైన శ్రీసరస్వతి పుష్కరాల్లో మంచిర్యాల జిల్లా పంచాయతీరాజ్ జిల్లా, మండలస్థాయి ఉద్యోగులు విధులు నిర్వరిస్తున్నారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ సుధాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మల ఉత్తర్వుల మేరకు జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు సేవల్లో నిమగ్నమయ్యారు. పుష్కరాల్లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రకడ్బందీగా నిర్వహిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణలో కీలకంగా వ్యవహరిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, వంటివి చేస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూస్తున్నారు. పుష్కర విధుల్లో డీపీవో వెంకటేశ్వర్‌రావుతోపాటు డీఎల్‌పీవో సఫ్దర్‌అలీ, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు(జైపూర్), అజ్మత్‌అలీ(చెన్నూర్), సత్యనారాయణ(మందమర్రి), బి.శ్రీనివాస్(బెల్లంపల్లి), అనిల్(తాండూర్), ప్రసాద్(దండేపల్లి)లు విధులు నిర్వర్తిస్తున్నారు.