
పట్టా భూములపై అటవీ అధికారుల దౌర్జన్యం
వేమనపల్లి: పట్టా భూములపై అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం అన్నారు. మండలంలోని చామనపల్లి గ్రామంలో శుక్రవారం ఆదివాసీ నాయకులతో కలిసి పట్టా భూములను పరిశీలించారు. చామనపల్లి శివారు సర్వే నంబర్ 67లో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అటవీ అధికారులు తమ భూమి అంటూ ఆదివాసీలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. సాగుచేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. సమస్యలను రెవెన్యూ అధికారులకు విన్నవిస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటవీ హక్కు పత్రాలు ఉన్న భూముల్లో సైతం సాగు చేస్తే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘం గ్రామ కమిటీ నాయకులు సాగర్, రెడ్డి కిరణ్, చీకటి మొండి, అంజి, కమల, మధునక్క, ఓదక్క తదితరులు పాల్గొన్నారు.