
ఉపాధ్యాయ శిక్షణను పరిశీలించిన అడిషనల్ డైరెక్టర్
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గర్మిళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ముల్కల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాలను మోడల్‌స్కూల్ ఆడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మకమైన విద్య అందించడంలో పాఠశాల హెచ్‌ఎంలు కీలకపాత్ర పోషించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని సూచించారు. 2025–26 విద్యా సంవత్సరంలో బడిబాటలో భాగంగా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. విద్యార్థుల ప్రగతిని, వారికి సంబంధించిన ప్రతీ అంశాన్ని తల్లిదండ్రులతో చర్చించాలని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరం ముగిసేసరికి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ చక్కని ఫలితాలు సాధిస్తూ పాఠశాలలను ఉన్నతస్థాయిలో నిలపడానికి ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేయాలని తెలిపారు. డీఈవో యాదయ్య మాట్లాడుతూ పరిసరాల విజ్ఞానాన్ని వివిధ రకాల చిత్రాలు, కృత్యాలు, వీడియోలు వినియోగిస్తూ బోధన చేయాలన్నారు. విద్యా సంవత్సరం ఆరంభంలోగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషి చేస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో సెంట్రల్ ఇన్‌చార్జి సత్యనారాయణమూర్తి, డీర్పీలు దత్తకుమార్, గిరిధర్‌రెడ్డి, ఎంఈవో తిరుపతిరెడ్డి, కోఆర్డినేటర్ చౌదరి, నోడల్ అధికారి హన్మాండ్లు, ముల్కల్ల పాఠశాల ప్రదానోపాధ్యాయుడు గణపతిరెడ్డి, రీసోర్స్‌పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.