
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
శ్రీరాంపూర్: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలోని తన చాంబర్‌లో ఏరియా ముఖ్య అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేసి అక్కడి నుంచి షిర్కే సెంటర్ మీదుగా జీఎం కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు.ఇక్కడి అమరవీరుల స్తూపం వద్ద, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. సాయంత్రం ప్రగతి మైదానంలో వేడుకలు జరుగుతాయని, ప్రత్యేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్ల డించారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులు పుర ప్రముఖులు హాజరై విజయవంతం చేసేలా అధికా రులు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏజీఎం(ఫైనాన్స్) బీభత్స, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్‌రెడ్డి, ఓసీపీ ప్రాజెక్టు అధికారులు ఏ.వెంకటేశ్వరరెడ్డి, టి.శ్రీని వాస్, ఏజెంట్ శ్రీధర్, డీజీఎంలు అరవిందరావు, ఆనంద్‌కుమార్, రవీందర్ వీటీసీ మేనేజర్ రామారావు, ఎన్విరాన్‌మెంట్ అధికారి హనుమాన్‌గౌడ్, సీనియర్ పీవో కాంతారావు పాల్గొన్నారు.
సివిల్ జీఎంకు సన్మానం ..
ఈనెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న సివిల్ జీఎం సూర్యనారాయణను అధికారులు ఘనంగా సన్మానించారు. జీఎం శ్రీనివాస్ సత్కరించి ఆయన కంపెనీకి చేసిన సేవలను కొనియాడారు.