
దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ కృషి
మంచిర్యాలఅగ్రికల్చర్: దళితుల అభ్యున్నతికి విశే ష కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం క లెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పోటు రవీందర్‌రెడ్డి, షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఈడీ దుర్గప్రసాద్, వివిధ సంఘాలతో కలిసి హాజరయ్యారు. భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్ట ర్ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం భాగ్యరెడ్డి వర్మ విశేష కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి సంతోష్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలి
మందమర్రిరూరల్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తక్షణమే రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం ఆయన మండలంలోని బొక్కలగుట్ట, సారంగపల్లి, గుడిపెల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ సతీష్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. కేంద్రాల బాధ్యులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.