
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
మంచిర్యాలఅర్బన్: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30గంటల నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1509 మందికి గాను 1428మంది హాజరుకాగా 81 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 1391 మందికి గాను 1324 మంది హాజరుకాగా 67మంది రాలేదు. ఒకేషనల్ పరీక్షలకు 118 మందికి గాను 104 మంది హాజరు కాగా 14 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 506 మందికి గాను 483 మంది హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 479 మందికి గాను 459 మంది హాజరుకాగా 20 మంది, ఒకేషనల్‌లో 27 మందికి గాను 24 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరైనట్లు డీఐఈవో అంజయ్య తెలిపారు.