
కారులో చెలరేగిన మంటలు
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పార్కింగ్ చేసి ఉన్న కారులో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే కుడి వైపు ఉన్న పాఠశాల గదిలో డీఈవో రామారావుతో శిక్షణ పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎడమ వైపున ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్, ఎమ్మెల్యేతో సమీక్షలో పాల్గొన్న అధికారులు, ఇతర కార్యాలయాల అధికారులు ఒక్కసారిగా హైరానా పడ్డారు. కాగా కలెక్టర్ సమీక్షలో పాల్గొన్న సత్తన్‌పల్లి డిప్యూటీ రేంజ్ అధికారి మహేశ్‌కు చెందిన కారుగా గుర్తించారు. కారులోని బ్యాటరీ వైర్లు ఎర్తింగ్ అయి మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే కారు. అద్దాలు పగుల గొట్టి అందులోని బ్యాగులు, ఇతర సామగ్రి బయటకు తీసి అక్కడే అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ పోసి మంటలు అదుపు చేయడంతో పాటు ఫైర్ ఇంజన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు.