
కేంద్ర ప్రభుత్వ నిధులు పక్కదారి
● ఎంపీ గోడం నగేష్
ఆదిలాబాద్: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం వాటిని వినియోగించకుండా దుర్వినియోగం చే స్తోందని ఆరోపించారు. ముఖ్యంగా గిరిజనుల్లో అ త్యంత వెనుకబడిన వర్గాలైన చెంచు, కోయ వర్గాల ప్రగతికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటికి ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిస్తే ఏమి చేయలేదని విమర్శిస్తూనే, కేంద్రం నుంచి వచ్చిన నిధులను విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. గతేడాది అక్టోబర్‌లో పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి రూ.152 కోట్లు కేంద్రం నుంచి విడుదలైతే ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. అక్టోబర్, మార్చి నెలల్లో సుమారుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.397 కోట్లు రాగా, వాటిని విడుదల చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని అడ్డుకుంటుందని మండిపడ్డారు. ఈ నెల 25లోగా కేంద్రం విడుదల చేసిన నిధులు అన్నింటినీ రిలీజ్ చేయాలని, లేనిచో గిరిజన సంఘాలతో కలిసి ఒత్తిడి తీసుకువస్తామన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే పాయల్ శంకర్, నాయకులు అస్తక్ సుభాష్, తదితరులు పాల్గొన్నారు.