
విద్యుదాఘాతంతో ఆవు మృతి
దండేపల్లి: మండలంలోని తాళ్లపేటలో గోళ్ల తిరుపతికి గల పాడి ఆవు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. మేతకు వెళ్లే సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఇనుప స్తంభానికి తగలడంతో షాక్‌కు గురైన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ.50 వేలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. ఇనుప స్తంభానికి షాక్ వస్తోందని రెండు మూడు రోజులుగా విద్యుత్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందన్నారు. గ్రామంలో గల ఇనుప విద్యుత్ స్తంభాలు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
అంజనీతండాలో..
నర్సాపూర్(జి): మండలంలోని అంజనీతండాలో రాథోడ్ దుర్గాదాస్ అనే రైతుకు చెందిన ఆవు గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మృతి చెందింది. దేవుని చెరువు దారిలో ఆవు మేత వేస్తుండగా మినీ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎర్తింగ్ రాడ్, వైర్లకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఘటన స్థలాన్ని పశు వైద్యాధికారి ముక్తార్ అహ్మద్, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి పంచనామా నిర్వహించారు. ఆవు విలువ సుమారు రూ.40 వేలు ఉంటుందని, నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరుతున్నాడు.