
‘బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలి’
పాతమంచిర్యాల: బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2026 నాటికి మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం నరమేధానికి ఒడిగట్టిందన్నారు. ఏడాదికాలంలో 540 మందిని ఎన్‌కౌంటర్ల పేర చంపేశారని, అందులో అమాయకులు, సా మాన్య పౌరులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టుచే న్యాయ విచా రణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్ కు మార్, ఐఎఫ్‌టియూ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీని వాస్, కార్యదర్శి బ్రహ్మనందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, సీపీఐ ఎంఎల్ మాస్‌లైన్ జిల్లా కార్యదర్శి దేవరాజ్, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంట సత్యం పాల్గొన్నారు.