
పశువుల పాకలు దగ్ధం
బోథ్: సొనాల మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ములైన రేంజర్ల సుదర్శన్, రేంజర్ల రాములుకు చెందిన రెండు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అ ర్ధరాత్రి పశువుల పాకకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో పశువులు అరవగా స్థాని కులు గమనించి సుదర్శన్, రాములుకు తెలిపారు. ఇచ్చోడలోని ఫైర్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఉద యం వరకు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా పా కలు పూర్తిగా దగ్ధమయ్యాయి. పశువులకు ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. వ్యవసాయ పనిము ట్లు, పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. రూ.5లక్షల నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా టెంబీ గ్రామానికి చెందిన జాదవ్ శేషారావు (60) రిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. శేషారావు కూతుళ్ల వివాహాలు చేసి అప్పులపాలయ్యాడు. మానసిక వేదనతో మద్యానికి బానిసయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.
పేకాడుతూ ఆరుగురి అరెస్ట్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని రాంపూర్‌లో ఓ ఇంట్లో పేకాడుతున్న ఆరుగురిని మంగళవారం అరె స్ట్ చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. వారి నుంచి రూ.1,860 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.