
నల్లబ్యాడ్జీలతో ఇఫ్టూ నిరసన
బెల్లంపల్లి: లేబర్ కోడ్‌ల రద్దు కోరుతూ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె వాయిదా వేయడంపై ఇఫ్టూ శ్రేణులు మంగళవారం బెల్లంపల్లి సివిక్ కార్యాలయం ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 20న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టాల్సి ఉండగా కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని తెలిపారు. ఈ తీరును తాము తీవ్రంగా నిరసిస్తున్నామని పేర్కొన్నారు. భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్ప డం సరికాదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో సాధారణ పరిస్థితులున్నా సమ్మె వాయిదా వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇప్టూ జిల్లా అధ్యక్షుడు టీ శ్రీనివాస్, నాయకుడు ఎండీ చాంద్‌పాషా, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణవేణి, వెంకటి, కొమురయ్య, భానుప్రసాద్, కుమార్, లింగన్న, పద్మ, సునీత, అమృత, కరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.