
‘ఆదివాసీ నాయకులపై చర్యలు తీసుకుంటాం’
ఇంద్రవెల్లి: ఏజెన్సీ చట్టాలను దుర్వినియోగం చేస్తు న్న ఆదివాసీ సంఘాల నాయకులపై చర్యలు తీసుకోనున్నట్లు రాయిసెంటర్ జిల్లా మేడి మెస్రం దు ర్గు, తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ తెలిపారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్‌లో గొండ్వా న పంచాయతీ రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఆదివా సీ సంఘాల నాయకులు, ఆదివాసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కొందరు నాయకులు ఆదివాసీ పెద్దల తీర్మానాలు పట్టించుకోకుండా, నోటీసులిచ్చి నా ఆదివా సీ సమావేశాలకు దూరంగా ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. త్వరలో వా రిపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ బాదిరావ్, రాయిసెంటర్ సార్‌మేడి మెస్రం వెంకట్‌రావ్, ఆయా గ్రామాల పెద్దలు పుర్క బాపురావ్, వెట్టి రాజేశ్వర్, ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలు పాల్గొన్నారు.