
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● గ్రీవెన్స్‌లో అర్జీల స్వీకరణ
ఉట్నూర్‌రూరల్: గిరిజనుల సమస్యల పరిష్కారా నికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఉ ట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. వా టిని సంబంధిత అధికారులకు అందజేసి సమస్యల ను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ వా రం 25 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్ల డించారు. ఇందులో ఎక్కువగా పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పథకాల మంజూరు, రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నట్లు తెలిపారు. ఉట్నూర్ మండలం మార్కగూడకు చెందిన మధు తమ గ్రామాని కి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని విన్నవించారు. తలమడుగు మండలం ఝరి గ్రామానికి చెందిన గేడం శంకర్ బోర్‌వెల్ మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏవో దామోదరస్వామి, ఈఈ తానాజీ, మేనేజర్ శ్యామల, డీపీవో ప్రవీణ్, జేడీఎం నాగభూషణం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.