
నేడు మంత్రి ‘పొంగులేటి’ రాక
భీమారం: భూభారతి చట్టంపై మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవా రం నిర్వహించనున్న అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి హాజరు కానున్నారు. సదస్సు నిర్వహించే పాఠశాల ప్రాంగణాన్ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి, కలెక్టర్ కుమార్ దీ పక్, డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వ ర్లు, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, డీఆ ర్డీవో కిషన్ సోమవారం వేర్వేరుగా సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. సదస్సుకు హాజ రయ్యే రైతులకు మంచినీటితోపాటు మజ్జిగ అందజేయనున్నట్లు ఆర్డీవో తెలిపారు.
ఎస్టీపీపీలో హెలిప్యాడ్ పరిశీలన
జైపూర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం జిల్లా పర్యటన నేపథ్యంలో స్థానిక ఎస్టీపీపీలోని హెలిప్యాడ్ స్థలాన్ని సోమవారం కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ఉదయం 9:50గంటలకు ప్లాంటుకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని ఇక్కడి నుంచి రోడ్డుమార్గంలో భీమారం వెళ్తారు.