
ఊర చెరువును కాపాడండి..
లక్సెట్టిపేట మండలం వెంకట్రావ్‌పేట ఊరచెరువు కబ్జాకు గురువుతోంది. వందల ట్రాక్టర్ల మొరం, మట్టి నింపుతూ కొందరు ఆక్రమించుకుంటున్నారు. చెరువు మట్టి శిఖం భూమిలో పోస్తూ ఆక్రమిస్తున్నారు. గతేడాది ఇలానే కొందరు ఆక్రమించుకోగా మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ప్రతియేటా కబ్జా కారణంగా చెరువుపై ఉపాధి పొందుతున్న మత్య్సపారిశ్రామిక సంఘానికి చెందిన 150 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. విచారణ చేపట్టి చర్యలు తీసుకుని చెరువును రక్షించాలి.
– మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు, గ్రామం: వెంకట్రావ్‌పేట, మం: లక్సెట్టిపేట