● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకునేదెలా..? ● నిబంధనలు పాటించని యజమానులు ● అగ్నిమాపక శాఖ అధికారులకు ‘మామూలే..’ | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్ని ప్రమాదాలు జరిగితే తప్పించుకునేదెలా..? ● నిబంధనలు పాటించని యజమానులు ● అగ్నిమాపక శాఖ అధికారులకు ‘మామూలే..’

May 20 2025 12:15 AM | Updated on May 20 2025 12:15 AM

● జిల

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్

మంచిర్యాలక్రైం: జిల్లాలోని బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్‌సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ పాతబస్తీ గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం ఘటనతో జిల్లాలోని భవనాల్లో మనమెంత వరకు భద్రమనే సందేహాం తలెత్తుతోంది. గుల్జార్‌హౌస్‌ ఘటనలో 17 మంది మృతిచెందడం జిల్లా ప్రజలనూ కలిచివేస్తోంది. జిల్లాలో బహుళ అంతస్తుల భవనాలు, భ వన నిర్మాణాల సంఖ్య కాలక్రమేణా పెరుగుతోంది. గతంలో రెండు మూడంతస్తుల వరకు నిర్మాణాలు ఉన్న స్థలాల్లో అభివృద్ధిలో భాగంగా భారీ భవనా లు నిర్మాణం అవుతున్నాయి. అభివృద్ధి పరంగా అ వసరమే అయినా పౌరుల ప్రాణాలతో ముడిపడి ఉ న్న అగ్నిమాపక చర్యలను విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. ఫైర్‌సేఫ్టీ సర్వీస్‌ యాక్ట్‌–1999 సెక్షన్‌–13 ప్రకారం విద్యాసంస్థలు, భవనాలు, ఫంక్షన్‌హాళ్లు, ఆస్పత్రులకు మాత్రమే నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) ఇచ్చే అధికారం మున్సిపల్‌ కమిషనర్‌కు ఉంది. ఇతర నిర్మాణాలకు ఎన్‌వోసీ జారీ బాధ్యత రాష్ట్ర విపత్తు నిర్వహణ, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగానికే ఉంటుంది. నిబంధనల ప్రకారం 15మీటర్ల కంటే ఎత్తు ఉన్న నివాస, 18మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాణిజ్య నిర్మాణాలకు ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరి. గోదాములు, సినిమా థియేటర్లు, ఇతర నివాసేతర నిర్మాణాల్లోనూ అగ్నిమాపక చర్యలు అవసరం. మున్సిపల్‌కు సంబంధించిన ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్ల పరిశీలనలు తమ పరిధిలోకి రావంటూ అగ్నిమాపక అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. ఫైర్‌ సర్వీసెస్‌ విభాగామూ అంతగా శ్రద్థ చూపడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అగ్ని ప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఇదివరకు మున్సిపల్‌, అగ్నిమాపక శాఖ అధికారులు హడావుడి చేసి ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని షాపింగ్‌మాల్స్‌, షోరూమ్‌లు, బహుళ అంతస్తుల భవన యజమానులకు నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. జిల్లాలో 90శాతం బహుళ అంతస్తుల భవనాలకు ఫైర్‌సేఫ్టీ అనుమతులు లేకపోవడం గమనార్హం.

అనుమతుల తీరిదీ..

జిల్లాలో 150కి పైగా ప్రైవేటు ఆస్పత్రులు ఉండగా.. ఐదింటికే ఫైర్‌సేఫ్టీ అనుమతులు ఉన్నాయి. జూనియర్‌, డిగ్రీ కళాశాలలు 35 ఉండగా.. నాలుగు కళాశాలలకు, 155 పాఠశాలల్లో 20 స్కూళ్లకు అనుమతులు ఉన్నాయి. పేరున్న షాపింగ్‌మాల్స్‌ 27 ఉండగా ఒక్క దానికీ అనుమతి లేదు. ఆరు సినిమా థియేటర్లకు అనుమతి ఉండగా.. మూడేళ్లకోసారి రెన్యూవల్‌ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నోటీసులు జారీ చేసినా రెన్యూవల్‌ చేసుకోవడం లేదని ఫైర్‌ అధికారులు చెబుతున్నారు. 27లాడ్జీలు, 20 ఫంక్షన్‌ హాళ్లలో ఒక్కదానికీ అనుమతి లేకపోవడం గమనార్హం.

నిబంధనలు శూన్యం

నిబంధనల ప్రకారం 500 చదరపు మీటర్ల నిర్మాణ విస్తీర్ణం లేదా ఆరు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉ న్న ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వ్యాపార సముదా యాలకు ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరి. ఆయా ఏర్పాట్లను పరిశీలించి మున్సిపల్‌ అధికారులు ఎన్‌వోసీ జారీ చేయాలి. వాటి ఆధారంగా భవనాలకు నివాసయోగ్యత(ఓసీ) పత్రం ఇస్తారు. కానీ జిల్లాలో ఎక్కడా అగ్నిమాపక చర్యలు లేకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం భవనం చు ట్టూ ఏడు మీటర్ల సెట్‌బ్యాక్‌లు ఉంటేనే ఎన్‌వోసీ ఇ వ్వాలి. ఆ స్థాయిలో సెట్‌బ్యాక్‌లు ఉన్న వ్యాపార స ముదాయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, బహు ళ అంతస్తుల భవనాలు జిల్లాలో 20శాతం కంటే తక్కువే ఉన్నాయి. ఫైర్‌సేఫ్టీ లేని భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే సురక్షితంగా బయటపడడం ఎంతవరకు సాధ్యం అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

సిబ్బంది కొరత

జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, జన్నా రం ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక జిల్లా అధికారితో కలిపి 65 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 46 మంది మాత్రమే ఉన్నారు. 18 పోస్టులు ఖాళీ ఉన్నాయి. పైగా ఫైర్‌స్టేషన్‌ నిర్వహణ, శుభ్రత, పరిశుభ్రత ఏర్పాట్లు సైతం సిబ్బంది చూసుకోవాలి. ఒక చోట ప్రమాదం జరిగితే మరో చోటికి మరో బృందం వెళ్లేందుకు సిబ్బంది కొరతతోపాటు ఫైరింజన్లు సైతం ఒక్కొక్కటే ఉండడం వల్ల తిప్పలు తప్పడం లేదు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ప్లాస్టిక్‌ స్క్రాప్‌ గోదాంలో మంటలు ఆర్పేందుకు నాలుగు ఫైరింజన్లు వినియోగించాల్సి వచ్చింది. అయినా నయాపైసా విలువ చేసే ఆస్తిని కాపాడలేకపోవడం గమనార్హం.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు

ఫైర్‌ నిబంధనలు పా టించని వారికి నోటీసులు జారీ చేశాం. త్వరలో వ్యాపార స ముదాయాలు, వి ద్యాసంస్థలు, ఫంక్షన్‌హాళ్లు, బహుళ అంతస్తుల భవనాలను పర్యవేక్షించి ఫైర్‌ నిబంధనలపై యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తాం. కొందరు ఫైర్‌ అనుమతులు తీసుకున్న వారు రెన్యూవల్‌ చేసుకోవడం లేదు. వారికి నోటీసులు జారీ చేస్తాం. జిల్లాలో చాలా ఫంక్షన్‌ హాళ్లు, విద్యాసంస్థలు, ప్రైవేటు ఆసుపత్రులు, వ్యాపార సముదాయాలకు ఫైర్‌ అనుమతులు లేవు. వారికి నోటీసులు జారీ చేశాం. అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకుంటాం.

– భగవాన్‌రెడ్డి, జిల్లా ఫైర్‌ అధికారి

నిబంధనలు ఏం చెబుతున్నాయి

నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ నిబంధనల ప్రకారం భవనాల్లో అగ్ని ప్రమాదాలు నియంత్రించే పరికరాలు ఏర్పాటు చేయాలి.

భవంతులకు ఎయిర్‌ ఫోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల నుంచి విధిగా నిరభ్యంతర ప్రతాలు తీసుకోవాలి.

భారీ/నివాస భవంతులపై 25వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్‌ట్యాంక్‌ ఏర్పాటు చేసుకోవాలి

వీటికి అనుసంధానంగా నిమిషానికి 900లీటర్ల నీటిని పంప్‌ చేసే బూస్టర్‌ పంపులు ఏర్పాటు చేసుకోవాలి.

హౌస్‌ రీల్‌, ఆలారం, మంటలు ఆర్పే ఫోమ్‌ అందుబాటులో ఉంచాలి.

ఐదంతస్తులతోపాటు సెల్లార్‌ ఉన్న భవంతుల్లో స్ప్రింక్లర్లు అందుబాటులో ఉంచాలి.

భారీ భవనాల చుట్టూ ఫైరింజన్‌ తిరిగేందుకు అనువుగా ఉండాలి.

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు త్వరగా బయటకు వెళ్లేందుకు వీలుగా దారులు ఉండాలి.

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ  అంతస్తుల నిర్మాణాలు ● అగ్1
1/3

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ  అంతస్తుల నిర్మాణాలు ● అగ్2
2/3

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ  అంతస్తుల నిర్మాణాలు ● అగ్3
3/3

● జిల్లాలో భారీ సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ● అగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement