
నకిలీ, నిషేధిత విత్తనాలు అరికట్టాలి
● క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: నకిలీ, నిషేధిత విత్తనాల రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జి ల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం క లెక్టరేట్ సమావేశ మందిరంలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పనతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతీ దుకాణంలో నిల్వలు, ధరల పట్టిక ప్రదర్శించాలని తెలిపారు. ప్రత్యే క నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తన విక్రయదారుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ నకిలీ, నిషే ధిత విత్తనాల నిల్వ, సరఫరా కేంద్రాలను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్య వసాయ విస్తరణాధికారులు, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా సదస్సు ఏర్పాట్లు
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 20న భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే భూభారతి సదస్సుకు మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నార ని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదన పు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సన్నాహక సమావేశం నిర్వహించారు.