
దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీ లాల్, ఆర్డీవో హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికా రులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
● సింగరేణి ఓపెన్‌కాస్టులో భూమి కోల్పోయిన తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నస్పూర్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అక్కపురం రాజయ్య దరఖాస్తు అందజేశాడు.
● ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింపజేయాలని బెల్లంపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన కామెర లక్ష్మి, మేస్త్రి కీర్తిమాల కోరారు.
● తన భూమి ఆక్రమణకు గురవుతోందని, విచారణ జరిపి న్యాయం చేయాలని హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన తిప్పని సాయితేజ, జాతీయ రహదారి నిర్మాణంలో భూమి కోల్పోతున్న తన పేరు బాధితుల జాబితాలో నమోదు చేయాలని లక్సెట్టిపేట మండల కేంద్రానికి చెందిన గొల్లపల్లి మేఘన విన్నవించారు.
● మందమర్రి శివారులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందని, హద్దు ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోరారు.
● తన భర్త తిరుపతి గత ఏడాది మే 29న వడదెబ్బతో మృతిచెందాడని, ఆపద్బంధు పథకం వ ర్తించేలా చూడాలని కన్నెపల్లి మండలం ఖాజిపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీలత కోరింది.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణిలో అర్జీల స్వీకరణ