
కాలితో పరీక్ష రాసిన శంకర్
బెల్లంపల్లి: ఆత్మస్థైర్యం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. రెండు చేతులు లేకపోయినా కాలితో పరీక్ష రాసి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కా కతీయ యూనివర్సిటీ డిగ్రీ వార్షిక పరీక్షలు జ రుగుతున్నాయి. బీకాం కంప్యూటర్స్ ఫైనలియ ర్ విద్యార్థి నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన ఎల్లూరి శంకర్ సోమవారం తెలు గు పరీక్షకు హాజరయ్యాడు. చిన్నతనంలో వి ద్యుత్ షాక్‌తో రెండు చేతులూ కోల్పోయాడు. అయినా చదువుపై పట్టుదల ఏమాత్రం సడలలేదు. అంగవైకల్యం ఎంత బాధిస్తున్నా మనో నిబ్బరంతో ముందుకు సాగుతున్నాడు. పరీక్షల్లో సహచరులతో సమానంగా బెంచీపై కూ ర్చుని కాలి వేళ్లతో పెన్నును అదిమిపట్టి పరీక్ష రాసి ఆత్మవిశ్వాసాన్ని చాటాడు. పరీక్ష రాయడానికి స్క్రైబ్‌ను పెట్టుకునే అవకాశాలు ఉన్నా కాలి వేళ్లతో రాయడానికే మొగ్గు చూపాడు.