
రోడ్ల సుందరీకరణకు నిధులు మంజూరు
పాతమంచిర్యాల: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధిలోని వ్యాపార ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, సుందరీకరణకు రూ.78 కోట్లు మంజూరైన ట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు తెలిపా రు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో కాంగ్రెస్ నాయకులు, వ్యాపారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మంచిర్యాలలోని మార్కెట్ రో డ్డు, శ్రీనివాసటాకీస్ రోడ్డు, వాటర్‌ట్యాంకు ఏరి యా రోడ్డు, వేంకటేశ్వర టాకీస్, విశ్వనాథ ఆల యం, కాలేజీ రోడ్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపడుతామని అన్నారు. రహదారుల విస్తరణ, భూ గర్భ డ్రెయినేజీలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు జూన్‌లో ప్రారంభిస్తామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను తొలగిస్తామన్నారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి టు టౌన్‌కు అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని రెండు నెలల్లో చేపడుతామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు పూర్తి చేసి 2027లోపు ప్రారంభిస్తామని తెలిపారు. వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కును వారంలోపు ఏర్పాటు చేస్తామని, లే అవుట్, భూ కేటాయింపులను పరిశీలిస్తామని అన్నారు. కోడిగుడ్ల ఎగుమతి, మామిడిపండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ముల్కల్ల గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి ప్ర ణాళికలు తయారు చేశామని, ఐటీ పార్కును అనుసంధానంగా బసంత్‌నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
మంచిర్యాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పార్టీ లాగా జీవోలు తీసుకొచ్చి పాలాభిషేకాలు చేయడం లేదని, పక్కాగా నిధులు తీసుకొచ్చి పనులు చేయిస్తున్నానని అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందే అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని చెప్పారు. స్టోర్ట్స్ స్టేడియం నిర్మిస్తానని, నియోజకవర్గంలో ఆరు వేల మందికి రాజీవ్ యువ వికాసం పథకం అందిస్తామని తెలిపారు.
వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు
మంచిర్యాల ఎమ్మెల్యే
కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు