
మద్యానికి బానిసై ఒకరు..
ఇంద్రవెల్లి: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఈ.సాయన్న తెలిపిన వివరాల మేరకు మండల కేంద్రంలోని భీంనగర్‌కు చెందిన కాంబ్లే రాజు (46) కొంతకాలంగా మద్యానికి బాని య్యాడు. శుక్రవారం రాత్రి అతిగా మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. శనివారం ఉదయం ఓ రైతు పంటచేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన మేకల కాపరి గిరి దత్తాత్రేయ గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుని భార్య కాంబ్లే లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.