
డిగ్రీ విద్యార్థిని..
మందమర్రిరూరల్: ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మామిడిగట్టు గ్రామానికి చెందిన దుర్గం సాత్విక (19) మంచిర్యాలలోని సీవీ రామన్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శని వారం పరీక్షకు వెళ్లి ఇంటికి వచ్చింది. సాయంత్రం నల్లా వస్తుండడంతో చెప్పేందుకు వెళ్లగా తలుపు మూసి ఉంది. సందులోంచి చూడగా దూలానికి ఉ రేసుకుని కనిపించింది. ఇదిలా ఉండగా శుక్రవారం సాత్విక తండ్రి వెంకటేష్ విష రసాయనం సేవించగా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శనివారం సాత్విక తన తండ్రిని చూసి వచ్చినట్టు సమాచారం. మృతికి కారణలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయమై రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్‌ను సంప్రదించగా ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు.