
బావిలోపడి యువకుడు..
సారంగపూర్: మద్యం మత్తులో బావిలోపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు గోపాల్‌పేట్ గ్రామానికి చెందిన బర్కుంట రవి (30) శుక్రవారం మహబూబా ఘాట్స్ సమీపంలోని శేక్ సాహెబ్ దర్గా వద్ద బంధువులు చేసిన పండుగకు హాజరయ్యాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఘాట్స్ సమీపంలో వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.