
పాము కాటుతో మహిళ..
కౌటాల: మండలంలోని గుండాయిపేటకు చెందిన దుర్గం ప్రియత (26) శుక్రవారం రా త్రి పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై గుంపుల విజయ్ తెలిపారు. మృతురాలు ప్రియ త ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా పాము కాటువేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సిర్పూర్(టి)లోని సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యుల సూచన మేరకు కాగజ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతదేహాన్ని శనివారం ఎస్సై పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు. మృతురాలి భర్త దుర్గం ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.