
చలో.. చెన్నూర్!
● ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయం.. ● అగస్త్య మహాముని నడయాడిన నేల ● దుర్వాస మహర్షి కొలిచిన లక్ష్మీనారసింహుడు.. ● కోటి లింగాలు వెలిసిన గోదావరి తీరం.. ● తిలకించి.. పులకించాల్సిందే..
చెన్నూర్‌రూరల్: భక్తుల కొంగు బంగారంగా.. కోరిన కోర్కెలు తీర్చే ఆలయంగా పేరున్న శ్రీ మల్లికార్జునస్వామి ఆలయం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కత్తెరసాల గ్రామంలో ఉంది. చెన్నూర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో ప్రాసస్త్యం ఉంది. అగస్త్య మహాముని ఇక్కడ శివపార్వతులకు పూజలు చేసే వారని పురాణంలో ఉంది. ఇక్కడ వెలిసిన మల్లికార్జున స్వామి, భ్రమరాంభిక విగ్రహాలకు కాకతీయ మహారాజులు పరిపాలించే కాలంలోనే ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబు తోంది. ఏటా మహా శివరాత్రి పర్వదినాన శివపార్వతుల కల్యాణం, మూడు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. జాతరకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఒగ్గు పూజారులు ఒగ్గు కథలు, పట్నాలతో మల్లన్న స్వామికి బోనాలు సమర్పిస్తారు. ఏడాది పొడవునా ప్రతీ బుధ, ఆది వారాల్లో ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి ఇక్కడ బోనాలు చెల్లించి మొక్కులు తీర్చుకుంటారు.
లోక రక్షణకోసం దుర్వాస మహర్షి తపస్సు..
చెన్నూర్ మండలంలోని అక్కెపల్లిలో దుర్వాస మహర్షి లోక రక్షణ కోసం ఘోర తపస్సు చేసి లక్ష్మీనారసింహుడిని ప్రసన్నం చేసుకున్నాడని, అనంతరం నరసింహస్వామిని ఇక్కడ ప్రతిష్టించాడని కాళేశ్వర ఖండం చెబుతోంది. ఇక్కడ వెలిి సన నారసింహుడు సర్పాకారంలో వెలిసిన అ త్యంత మహిమాన్వితుడిగా పేర్కొంటారు. నారసింహుడు అక్కెపల్లి నుండి కాళేశ్వరం వరకు విస్తరించి ఉన్నాడని పూర్వీకుల నమ్మకం. పూర్వం ప్ర జలు కాళేశ్వరం నుండి బయలు దేరి గోదావరిలో స్నానమాచరించి వివిధ క్షేత్రములు తిరిగి లోక రక్షకుడైన నారసింహుడుని దర్శించుకునేవారు. చెన్నూర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. కానీ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లు కోటిలింగాలు
చరిత్ర గొప్పది
చెన్నూర్ చరిత్ర ఎంతో గొప్పది. మునులు, ఋషులు నడయాడిన నేల ఇది. కత్తెరసాలలో మల్లికార్జున స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. నారాయణపూర్ సమీపంలోని కోటిలింగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కెపల్లి లక్ష్మీనారసింహుడు స్వయంభుగా బండకు వెలిశాడు. దుర్వాస మహర్షి ఇక్కడ పూజలు చేసే వారని కాళేశ్వర ఖండం చెబుతోంది.
– హిమాకర్ శర్మ, వేద పండితుడు, శివాలయం
సహజ సిద్ధంగా బండరాళ్లకు వెలిసిన కోటిలింగాలు ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పురాతన కాలం నాటి ఈ కోటిలింగాలకు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. కత్తెరసాల నుంచి మూడు కిలోమీటర్లు, చెన్నూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో నారాయణపూర్ గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున వెలిసాయి. సుమారు 1800ల ఏళ్ల క్రితమే ఈ కోటిలింగాలు వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ కోటిలింగేశ్వర ఆలయం ఉన్న ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బండరాళ్లపై వివిధ రకాల దేవతామూర్తులు కొలువు దీరారు. పార్వతి కొల్లుకుంట, పాయిరాల కొలను, యమకోనం, వినాయక విగ్రహాలు, నందిపాదం, శివలింగం, శివుని ఆత్మలింగాలు, పార్వతి, నంది గుర్తులు ఇక్కడ దర్శన మిస్తాయి. అగస్త్య మహాముని కత్తెరసాలలోని మల్లికార్జునస్వామి ఆలయం నుంచి సొరంగ మార్గం ద్వారా కోటిలింగాలకు వెళ్లి అక్కడ గోదావరి నదిలో స్నానమాచరించి తిరిగి కత్తెరసాలకు వెళ్లి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించేవారని కాళేశ్వర ఖండం చెబుతోంది. కాకతీయులు పరిపాలించే కాలంలో రాజులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసేవారని స్థల పురాణంలో ఉంది.

చలో.. చెన్నూర్!

చలో.. చెన్నూర్!

చలో.. చెన్నూర్!

చలో.. చెన్నూర్!

చలో.. చెన్నూర్!