
నల్లబెల్లం, పటిక తరలిస్తున్న వ్యక్తి అరెస్టు
ఖానాపూర్: ఖానాపూర్ నుంచి మామాడ మండలం వెంకటాపూర్‌కు ద్విచక్రవాహనంపై నల్లబెల్లం, పటిక తరలిస్తున్న సాయిబాబాను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ రంగస్వామి తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల దుకాణం నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. దుకాణం యజమాని రఫేకాన్, సిబ్బంది రంజిత్‌తో పాటు సాయిబాబాపై కేసు న మోదు చేశామన్నారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై వసంత్‌రావు, సిబ్బంది గౌతమ్, రవీందర్, కల్పనా, సాయి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
డబ్బులు వసూలు చేసిన
ఇద్దరి రిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో రెండు రోజుల క్రితం ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. పట్టణంలోని తిర్పెల్లికి చెందిన కాసిప్, భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన జహీర్ రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు భయభ్రాంతులకు గురిచేశారన్నారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో శనివారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.
అడేగామ(కే)లో చోరీ
ఇచ్చోడ: మండలంలోని అడేగామ(కే)లో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. గ్రామానికి చెందిన కుంబోజి నారాయణ ఇంటికి తాళం వేసి ఆదిలాబాద్ మండలంలోని జైనథ్ వెళ్లాడు. గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.2.50 లక్షలతో పాటు, రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.