
ఉత్తమ ప్లాంటేషన్ వాచర్‌గా సాయికిరణ్
జైపూర్: తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ)లో పనిచేస్తున్న ఎ.సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్‌గా ఎంపికయ్యాడు. టీజీఎఫ్‌డీసీ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన జాబితాలో కాగజ్‌నగర్ డివిజన్ మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ ఎంపికయ్యాడు. 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్లను రక్షిస్తూ ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్నందుకుగానూ ఈ అవార్డు అందుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ శ్రావణి చేతుల మీదుగా ప్రశంసపత్రంతో పాటు రూ.5వేల నగదు బహుమతి అందుకున్నారు. శని వారం మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్‌కుమార్, సిబ్బంది అభినందించారు.