
మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
లక్ష్మణచాంద: మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చే సుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై సుప్రియ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన ఆలుగొట్టు పెద్ద గంగన్న (61)కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అతని భార్య లక్ష్మితో గొడవపడగా కూ తురు ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురై శు క్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకు ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లక్ష్మి ఇచ్చిన ఫి ర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.