
ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం
● డీటీఓ సంతోశ్‌కుమార్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యాసంస్థల బ స్సుల ఫిట్‌నెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా రవాణా శాఖ(డీటీఓ) అధి కారి సంతోశ్‌కుమార్ అన్నారు. శుక్రవారం వేంపల్లిలోని జిల్లా ర వాణా శాఖ కార్యాలయంలో విద్యాసంస్థల యాజ మాన్యాలు, బస్సు డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధివిధానాలు వివరించారు. కండీషన్‌లో లేకుండా విద్యార్థులతో ర వాణా సాగిస్తే, ఆకస్మిక తనిఖీల్లో నిర్లక్ష్యం కని పిస్తే ఆ బస్సులను అక్కడికక్కడే సీజ్ చేస్తామ ని స్పష్టం చేశారు. కాలం చెల్లిన బస్సులను స్క్రాప్ కింద జమ చేయాలని చెప్పారు. విద్యాసంస్థల వాహనాల కండీషన్, ధ్రువీకరణ పత్రాలు స్కూళ్ల ప్రారంభంలోగా సరి చూసుకోవాలన్నారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఎంవీఐ రంజిత్, ఏఎంవీఐ ఖాసీంసాహెబ్ పాల్గొన్నారు.