
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద బర్డ్‌వాచ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం లక్సెట్టిపేట అటవీ రేంజ్ పరిధిలో ని అధికారులు బర్డ్‌వాచ్ కార్యక్రమాన్ని నిర్వహించా రు. లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి సుభాష్, డె ప్యూటీ రేంజ్ అధికారి హఫీజొద్దీన్, గోపీ, ఎఫ్‌ఎస్ ఓలు అల్తాఫ్‌హుస్సేన్, అహ్మద్ పాల్గొన్నారు. ప్రా జెక్ట్ నీటిలో చెట్లపైనే కాకుండా పరిసర ప్రాంతాల్లో పలు రకాల పక్షులు గుర్తించారు. నారాయణపక్షి, చి త్వా, నలంచి, చిట్టిపావురం, చెరువుకొంగ, గో రింక, తెల్లమొండం(నీటి కొంగ), వైట్–త్రోటెడ్ కింగ్‌ఫి షన్, రెడ్–వాటిల్డ్ ల్యాపింగ్, గ్రీన్‌బీ ఈటర్, బార్న్ స్వాలో, జంగిల్ బబ్లర్, పర్పుల్ సన్‌బర్డ్, ఏషియన్ కోయల్ తదితన 22 రకాల పక్షులు కనిపించినట్లు అటవీ రేంజ్ అధికారి సుభాష్ తెలిపారు.