పదోన్నతితో పోలీసులకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పదోన్నతితో పోలీసులకు గుర్తింపు

May 17 2025 6:45 AM | Updated on May 17 2025 6:45 AM

పదోన్నతితో పోలీసులకు గుర్తింపు

పదోన్నతితో పోలీసులకు గుర్తింపు

మంచిర్యాలక్రైం: పదోన్నతి ద్వారానే పోలీసులకు గుర్తింపు లభిస్తుందని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. శుక్రవారం రామగుండం కమిషనరేట్‌లో ఏఆర్‌ కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా, హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఆర్‌ ఏఎస్సైగా పదోన్నతి లభించిన సందర్భంగా వారిని పదోన్నతి చిహ్నాంతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీస్‌ పూర్తి చేయాలని, ప్రతిభ కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్‌ దామోదర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement