‘వికాసం’ ఆలస్యం..!
● అర్హుల గుర్తింపులో జాప్యం ● మండల స్థాయిలో పూర్తి కాని జాబితా ● సిబిల్ స్కోర్‌పై ఆదేశాలు రాక పెండింగ్
మంచిర్యాలటౌన్: జిల్లాలో రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మండలం, మున్సిపాల్టీ వారీగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా గుర్తించిన వారి వివరాలు బ్యాంకులకు పంపిస్తున్నారు. సిబిల్ స్కోర్ ఆధారంగా సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలన నేపథ్యంలో అర్హుల ఎంపికలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిబిల్ స్కోర్ పరిగణనలోకి తీసుకోబోమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించినా అధికారిక ఉత్తర్వులు వెలుకవడకపోవడం, బ్యాంకర్లు స్పష్టత ఇవ్వకపోవడంతో మండలాల వారీగా అర్హుల జాబితా సిద్ధం కాలేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అర్హులకు సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుండగా అర్హుల ఎంపికపై తర్జన భర్జన కొనసాగుతోంది.
యూనిట్లు తక్కువ... దరఖాస్తులు ఎక్కువ
దరఖాస్తుల పరిశీలనకు మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. కన్వీనర్లుగా ఎంపీడీవోలు, ము న్సిపల్ కమిషనర్లు, సభ్యులుగా మండల, ము న్సిపల్ ప్రత్యేక అధికారులు ఉన్నారు. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి అధి కారులు, బ్యాంకు మేనేజర్లు, డీఆర్డీవో కార్యాల యం అధికారులను కేటాయించారు. ము న్సిపాల్టీ లు, మండల కార్యాలయాల్లో దరఖాస్తుల్లో ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరి శీలించిన అనంతరం కమిటీల ఆధ్వర్యంలో జాబి తా సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపించారు. రుణాలు తీసుకునే వారు తిరిగి చెల్లిస్తారా లేదా, సిబిల్ స్కోర్ ఏ మేరకు ఉందనే వివరాల ప్రకారం జా బితా సిద్ధం చేసి కమిటీ సభ్యులకు అందించాలి. కానీ ఇప్పటికీ బ్యాంకర్ల నుంచి అ ర్హుల జాబితా ఇవ్వకపోవడం, సిబిల్ స్కోర్‌పై అధికారిక ఉత్తర్వులు లేకపోవంతో తుది జాబితా అందడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కేటాయించిన యూనిట్లు తక్కువగా ఉండగా దరఖాస్తులు భారీ సంఖ్యలో వచ్చా యి. అన్ని కార్పొరేషన్లకు కలిపి 55,948 ద రఖాస్తులు రాగా క్షేత్రస్థాయిలో పరిశీలించి 40,270 దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించారు. అన్ని కార్పొరేషన్లకు కలిపి 12,129 యూనిట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించగా.. 40,270 మంది దరఖా స్తుదారులు ఉన్నారు. ఈ నెల 17లోపు అర్హుల జాబి తా సిద్ధం చేయాల్సి ఉండగా ఎంతమందికి సబ్సిడీ రుణాలు అందుతాయో తేలనుంది.
జిల్లాలో వచ్చిన దరఖాస్తులు, యూనిట్లు
కార్పొరేషన్ దరఖాస్తులు యూనిట్లు
బీసీ 29690 3,907
ఈబీసీ 1051 698
ఎస్సీ 17,536 5,341
ఎస్టీ 4,199 1,644
మైనారిటీ 3,331 450
క్రిస్టియన్ మైనారిటీ 141 89


