‘పది’ సప్లిమెంటరీకి సన్నద్ధత
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తోంది. జూన్ 3నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా.. ప్రత్యేక తరగతుల నిర్వహణకు డీఈవో యాదయ్య జూమ్ మీటింగ్, ఫోన్ సందేశాలు పంపించారు. దీంతో అనుత్తీర్ణులైన విద్యార్థులకు బోధన, పునశ్చరణ, వెనుకబడిన వారిపై దృష్టి సారించారు. ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైన బడుల్లో ఆన్‌లైన్, ప్రత్యక్ష తరగతుల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణపై డీఈవో ప్రధానోపాధ్యాయులకు సందేశాలు పంపిస్తూ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లాలో గతం కంటే మెరుగైన ఫలితాలతో ఈసారి 17 స్థానంలో నిలిచింది. మొ త్తం 9,179 మంది విద్యార్థులకు గాను 8,861మంది ఉత్తీర్ణత సాధించారు. 318మంది అనుత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 183మంది, బాలికలు 135మంది ఉన్నారు. ఎక్కువ మంది గణితంలోనే తప్పారు. సబ్జెక్టుల వారీగా పరి శీలిస్తే గణితంలో 166మంది, తెలుగులో 143 మంది, సైన్స్‌లో 53 మంది, ఇంగ్లిషులో 38మంది ఫెయిలయ్యారు. వీరికి సబ్జెక్టులపై భయం తొలగించి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
రెండేసి జిల్లాలకు ఒక్కో ప్రత్యేక అధికారి
‘పది’ సప్లిమెంటరీకి సన్నద్ధత


