
డెంగీపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలటౌన్: డెంగీ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన క ల్పించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హ రీశ్‌రాజ్ అన్నారు. ఈ నెల 16న జాతీయ డెంగీ దినోత్సవం పురస్కరించుకుని గురువారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. జిల్లాలోని ఆరోగ్య కార్యకర్తలు, ఆశా, అంగన్‌వాడీ టీచర్లు సమన్వయంతో అవగాహన చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఈ ఏడాది 42 మందికి పరీక్ష చేస్తే ఇద్దరికి డెంగీ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఇల్లు, పరిసరాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రతీ ఫ్రై డే డ్రై డే పాటించాలని తెలిపా రు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ అనిత, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ సీతా రామరాజు, డాక్టర్ అనిల్ కుమార్, ప్రశాంతి, కాంతారావు, దామోదర్, సంతోశ్, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.