
కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు నమోదు చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఫార్మసి ఆఫీసర్లు కుటుంబ నియంత్రణ, కుటుంబ సంక్షేమ కార్యక్రమాల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని ఫార్మసీ ఆఫీసర్లకు ఏపీఎల్‌ఎంఐఎస్ ప్రోగ్రాం కింద శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్లు సమీక్ష చేసి కుటుంబ నియంత్రణలో భాగంగా తాత్కాలిక, శాశ్వత పద్ధతులకు అవసరమయ్యే నిరోధ్, అంతర వంటి వాటిని అర్హులైన దంపతులకు అందజేసేందుకు ఇండెంట్ నమోదు చేయాలని అన్నారు. ఇండెంట్, ఖర్చు వివరాల నమోదుపై శిక్షణ ఇచ్చారు. ఎస్‌వో డాక్టర్ సీతారామరాజు, డీపీవో ప్రశాంతి, ప్రవళిక, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు డాక్టర్ కృష్ణతేజ, ఫార్మసీ ఆఫీసర్ శంకర్, డెమో బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు.