
పరారైన నిందితుడి అరెస్టు
లక్సెట్టిపేట: చోరీ కేసులో లక్సెట్టిపేట జైలుకు తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పరారైన నింది తుడిని పట్టుకుని అరెస్టు చేసినట్లు లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్, ఎస్సై సురేశ్ తెలిపారు. స్థానిక పో లీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా మావల మండలానికి చెందిన రాంమల్లే గజానంద్ అలియాస్ కరణ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేస్తూ నస్పూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి ఈనెల 13న లక్సెట్టిపేట సబ్ జైలుకు రిమాండ్ చేసేందుకు తీసుకువస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడి కోసం గాలిస్తుండగా గురువారం ఉదయం బస్టాండ్ సమీపంలో ఎస్సై, సిబ్బంది పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.