
సింగరేణి హైస్కూల్ లోగో ఆవిష్కరణ
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలో సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్)ను ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంస్థ సీఎండీ బలరాం నాయక్ బుధవారం హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో డైరెక్టర్ (ఆపరేషన్) సూర్యనారాయణతో కలిసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదెకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేసిన హైస్కూల్‌లో ఇప్పటి వరకు సుమారు 40 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారన్నారు. హైస్కూల్ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
యువతి అదృశ్యం
నర్సాపూర్(జి): మండల కేంద్రానికి చెందిన బర్కుంట వాణి (33) అదృశ్యమైనట్లు ఎస్సై సాయికిరణ్ తెలిపారు. ఏప్రిల్ 23న ఇంటినుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఇంతకాలం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి బర్కుంట పెద్ద ముత్యం బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సింగరేణి హైస్కూల్ లోగో ఆవిష్కరణ