
లారీ బోల్తాపడి డ్రైవర్ మృతి
కాసిపేట: లారీ బోల్తాపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని మల్కేపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రాకేశ్ (27)లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి లారీలో సిమెంటు లోడ్ చేసుకుని వెళ్తుండగా సిద్దిపేట వద్ద డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో లారీ బోల్తాపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి, సోదరుడు ఉన్నారు.
వడదెబ్బతో తునికాకు కూలీ..
చింతలమానెపల్లి: మండలంలోని అంబగట్టకు చెందిన తునికాకు కూలీ బండి విమల (58) వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు. విమల ఈనెల 10న తునికా కు సేకరణకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. మంగళవారం అడవికి వెళ్లిన గ్రామస్తులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడు కొండ య్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
గుడుంబా పట్టివేత
దస్తురాబాద్: మండలంలోని గొడిసిర్యాలలో బుధవారం 25 లీటర్ల గుడుంబాను పట్టుకున్నట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహి ంచగా గ్రామానికి చెందిన కొంపెల్లి నర్సయ్య వద్ద 8 లీటర్లు, జక్కుల సత్తవ్వ వద్ద 9 లీటర్లు, బత్తుల రాజన్న వద్ద 12 లీటర్ల గుడుంబాను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సురేందర్, రజిత, కళ్యాణి పాల్గొన్నారు.