
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
ఆదిలాబాద్‌టౌన్: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఖుర్షీద్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కమ్ కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాత్రి 10.30 గంటల తర్వాత ఇంటిముందు గుంపులుగా కూర్చోవడం వంటివి చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కాలనీలో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా కాలనీకి చెందిన ఓ వ్యక్తి బైక్ నంబర్ ప్లేట్ మార్చడంతో అతనిపై కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.