అలా నాన్నతో తిట్లు తప్పాయి
చెన్నూర్: నాది అమ్మనగుర్తి గ్రామం. సైదాపూర్ మండలం. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాను. నా చిన్నప్పుడు దోస్తులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లాను. మా నాన్న ఆగమరావుకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చి దే వేందర్ ఎటుపోయాడని మా అమ్మను అడిగారు. చదువుకునేందుకు క్లాస్‌మెంట్ ఇంటికి వెళ్లాడని చెప్పింది. నేను ఇంటికొచ్చాక అడిగివారు. సమాధానం చెప్పేలోగా అమ్మ ముందుగానే వాడు దోస్తు ఇంటికి చదువుకునేందుకు వెళ్లాడు అని చెప్పాను కదా అంది. అలా నాన్నతో తిట్లు తప్పాయి. ఆ రోజున నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆ నాటి నుంచి అమ్మకు చెప్పకుండా ఎటూ వెళ్లలేదు.


