హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
ఆదిలాబాద్‌టౌన్: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదుతో పాటు రూ.4వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు బుధవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహా జన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడకు చెందిన షేక్‌అస్లమ్, కోకటి విజ య్ తమ మిత్రుడైన న్యూ హౌజింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఇందూర్ గజానంద్ హెచ్‌ఎఫ్ డిల క్స్ బైక్ చోరీ చేయాలనే కుట్రతో ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు తీసుకెళ్లారు. కత్తితో గొంతు కోసి జైనథ్ శివారులోని వైఆర్‌కే కన్‌స్ట్రక్షన్ వద్ద పడేసి బైక్‌తో పరారయ్యారు. అప్పటి జైనథ్ ఎస్సై కేసు నమోదు చేసి నిందితులను విచారించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. డ్యూటీ అధికారి జమీర్ 25 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ మేకల మధుకర్, రహీమ్ నేరం రుజువు చేయడంతో జడ్జి తీర్పునిచ్చారు.
పోక్సో కేసులో పదేళ్ల జైలు
రెబ్బెన: బాలికను ప్రేమపేరుతో పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న నిందితుడికి పోక్సో కేసు కింద పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 60వేల జరిమానా విధిస్తూ బుధవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పునిచ్చారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి తెలిపిన వివరాల మేరకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన చునార్కర్ మహేందర్ అనే వివాహితుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో 2019 ఆగస్టు 15న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై డీకొండ రమేశ్ కేసు నమోదు చేయగా డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి నిందుతుడిని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి తీవ్ర గాయాలు
కుంటాల: మండలంలోని అంబకంటి గ్రామ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఎస్‌కే.లతీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్(జి) మండలంలోని బామ్ని(బి) గ్రామానికి చెందిన లతీఫ్ పని నిమిత్తం బుధవారం ద్విచక్ర వాహనంపై కుంటాలకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా అంబకంటి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఎన్‌సీసీ విస్తరణకు కృషి
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్‌సీసీ విస్తరణకు కృషి చేస్తున్నామని ఎన్‌సీసీ నిజామాబాద్ గ్రూప్ కమాండర్ సునీల్ అబ్ర హం అన్నారు. జిల్లా కేంద్రంలోని 32 టీ బెటా లియన్ ఎన్‌సీసీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్‌కు మరో బెటాలియన్ మంజూరైందన్నారు. ఈ 38వ బెటాలియన్ ఏర్పాటైతే రిక్రూట్‌మెంట్ పెరుగుతుందన్నారు. ఆసిఫాబాద్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెటాలియన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కమాండింగ్ అధికారి వికాస్ శర్మ, ఎన్‌సీసీ అధికారులు గాలి అశోక్, తదితరులు పాల్గొన్నారు.


