
అప్పటి తీపిజ్ఞాపకాలేవి?
నిర్మల్‌ఖిల్లా: ఆరు దశాబ్దాల క్రితం నాలుగు నుంచి పదో తరగతి వరకు ఖానాపూర్‌లో చదివాను. గోదావరి నది మా ఇంటి సమీపంలోనే ఉండేది. వేపవి సెలవుల్లో అందులో ఈత నేర్చుకునేవాళ్లం. మా అమ్మమ్మ ఊరు రాయికల్‌కు వెళ్లాలంటే గోదావరి నదిని ఎడ్లబండిలో దాటేది. ఆ తర్వాత ప్రైవేట్ వాహనంలో వెళ్లేవాళ్లం. మామిడి కాయలు కోసి దోస్తులమంతా ఉప్పు పెట్టుకుని తినేవాళ్లం. దగ్గరలోని గ్రంథాలయానికి వెళ్లి బాలలబొమ్మల పుస్తకాలు చది వేది. నమ్మక్, గిల్లీ–దండా, కోతికొమ్మ, గోలీ లు, కబడ్డీ లాంటి ఆటలు ఆడేది. కొత్త ఆవకాయ, అన్నం తీసుకెళ్లి ఒత్తుగా కలుపుకొని గోదావరి ఒడ్డున కూచోని తింటూ దోసిళ్లతో నీళ్లు తాగేది. అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే మళ్లీ కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది.
– సంపత్‌కుమార్, నవలా రచయిత, కెనడా రాయబార కార్యాలయ సీనియర్ సలహాదారు