
మోటబావిలో ఈతకొట్టెటోళ్లం
మంచిర్యాల అర్బన్: మాది పాత వరంగల్ జిల్లా (జనగాం) నర్మెట్ట మండల బొమ్మకూర్. వేసవి సెలవులు రాగానే అమ్మమ్మ–తాతయ్య ఊరు హన్మంతపూర్‌కు వెళ్లేవాళ్లం. ఉదయం నుంచి చిన్నపిల్లలందరం కలిసి సిర్రగోనె, కబడ్డీ, చింతపిక్కలు తదితర ఆటలాడేవాళ్లం. సా యంత్రం అయిందంటే చాలు మోటబా విలో అందరం కలిసి ఈత కొట్టేవాళ్లం. ఇంటి ఆవరణలో మామిడి, వేపచెట్లు ఉండేవి. మామిడి కాయలు తెంపి కారం, ఉప్పుతో కలిపి తినటం ఇప్పటికీ మరి చిపోలేం. అమ్మమ్మ చేసే జొన్న అంబలి ఎంతో రుచిగా ఉండేది. రాత్రి కాగానే కుటుంబసభ్యులమంతా వేపచెట్టు కింద మంచం వేసుకుని, నేలపై పడుకుని కబుర్లు చెప్పుకొంటూ నిద్రలోకి జారుకునేవాళ్లం. అప్పట్లో బ్రహ్మంగారి చరిత్ర నాటకాన్ని కళాకారులు ప్రదర్శించగా ఎంతో ఆసక్తిగా చూసేవాళ్లం.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల