
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● ఎత్తిపోతల పథకాల్లో వరుస చోరీలు
● రణవెల్లిలో చోరీ చేస్తుండగా పట్టివేత
చింతలమానెపల్లి: మండలంలోని రణవెల్లి ఎత్తిపోతల పథకంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని పట్టుకున్న ట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. మంగళవారం కౌటాలలోని తన కార్యాలయంలో ఇందు కు సంబంధించిన వివరాలను ఎస్సై నరేశ్‌తో కలిసి వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం రణవెల్లి గ్రామ స మీ పంలో ప్రాణహిత నదిపై నిర్మించిన ఎత్తిపోతల ప థకాన్ని ప్రారంభించకపోవడంతో నిరుపయోగమైంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కేంద్రం లక్మాపూర్‌కు చెందిన డాన్‌సింగ్, గణేశ్ సోడంకి, స తీశ్ సీతారాం, రాజు సాహు, రాజోల్ సాహు ఎత్తి పోతల పథకంలోని పంపుహౌస్‌లో మోటర్లలోని రాగి తీగ చోరీ చేసేందుకు ఏప్రిల్ 13న, 19న రెక్కీ నిర్వహించారు. అదే నెల 26న పంపుహౌస్‌లోని మోటార్లను విడదీసి వెళ్లిపోయారు. విషయాన్ని వాచ్‌మన్ లెండుగురె పోశం గమనించి సమాచారమివ్వగా ఎత్తిపోతల పథకం సూపర్‌వైజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 29న చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల సూచన మేరకు పోశం మరో ఏడుగురు పంపుహౌస్‌పై నిఘా పెట్టారు. ఈనెల 4న నిందితులు మోటర్లలోని రాగితీగను బయటకు తీసి 5న రాత్రి తరలిస్తుండగా గ్రామస్తుల సాయంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదుగురిలో ముగ్గురు పారిపోగా డాన్‌సింగ్, గణేశ్ గ్రామస్తులకు చిక్కారు. వీరిని చితకబాదిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిమిచ్చారు. అక్కడికి చేరుకున్న ఎస్సై నరేశ్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సమీప చెట్లపొదల్లో దాచిన 95కిలోల రాగితీగ, 15కిలోల ప్లేట్లు, ఇతర పని ముట్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గతంలో మహారాష్ట్రలో పలు చోరీ కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి ఎత్తిపోతల పథకంలోనూ గతంలో చోరీకి పాల్పడ్డారు. హుడ్కిలి ఎత్తిపోతల పథకంలో చోరీ చేసిన సామగ్రిని రూ.3లక్షలకు విక్రయించారు. ఎత్తిపోతల పథకంలో చోరీ చేసిన సామగ్రి విలువ రూ.1.30లక్షలు ఉంటుందని సీఐ వివరించారు.