
రైస్‌మిల్లర్లు లక్ష్యాలను పూర్తి చేయాలి
మందమర్రిరూరల్: రైస్‌మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల ని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంబికాసాయి, వాసవి, లక్ష్మీగణపతి, వెంకటేశ్వర రైస్‌మిల్లులను తహసీల్దార్ సతీష్‌కుమార్‌శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లారీలను లోడ్‌తో గంటల తరబడి వేచి ఉంచొద్దని, అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, వెంటనే అన్‌లోడ్ చేసి పంపించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం సందర్శించారు.
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.