
భార్య కాపురానికి రావడం లేదని..
తానూరు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బోల్సా గ్రామానికి చెందిన అక్కం రమేశ్ గతకొన్నేళ్లుగా మద్యానికి బానిసై పని చేయకుండా తిరుగుతున్నాడు. భర్త తాగుడు మానడం లే దని కుమారుడు, కుమార్తెతో కలిసి భార్య స్వరూప పుట్టిల్లు అయిన ముధోల్‌కు వెళ్లింది. రెండునెలల క్రితం రమేశ్ ముధోల్‌కు వెళ్లి భార్యతో ఉంటున్నాడు. భార్య కాపురానికి రావాలని అడిగితే రాకపోవడంతో ఒక్కడే రెండురోజుల క్రితం బోల్సాకు వెళ్లాడు. భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మిబాయి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ట్రెయినీ ఎస్సై తెలిపారు.